how to fill praja palana application form in telugu | ‘ప్రజాపాలన’ దరఖాస్తులు

how to fill praja palana application form in telugu | 'ప్రజాపాలన' దరఖాస్తులు
how to fill praja palana application form in telugu | ‘ప్రజాపాలన’ దరఖాస్తులు

how to fill praja palana application form in telugu | ‘ప్రజాపాలన’ దరఖాస్తులు :

కాంగ్రెస్ ప్రభుత్వం ‘అభయహస్తం’ గ్యారంటీ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక కోసం నేటి నుంచి దరఖాస్తులు స్వీకరించనుంది. ‘ప్రజాపాలన దరఖాస్తు’ ఫారాన్ని సీఎం రేవంత్ రెడ్డి బుధవారం విడుదల చేసారు. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత.. అయిదు పథకాల వివరాలు ఈ ఫారంలో ఉన్నాయి. ప్రతి పథకానికి వేర్వేరుగా దరఖాస్తు చేసుకోనవసరం లేకుండా.. ఏ పథకానికి అర్హులైనవారు ఆ పథకానికి అవసరమైన వివరాలు మాత్రమే దరఖాస్తు ఫారంలో నింపాల్సి ఉంటుంది. అన్ని పథకాలకూ అర్హులైనా.. ఒకే దరఖాస్తులోని ఆయా వివరాలు నింపితే సరిపోతుంది. దరఖాస్తు ఫారంతో పాటు రేషన్‌కార్డు, ఆధార్‌ కార్డు జిరాక్స్‌ కాపీలు, దరఖాస్తుదారు ఫొటో ఇవ్వా్ల్సి ఉంటుంది.

Telegram Group Join Now
Instagram Group Join Now

మెుత్తం నాలుగు పేజీల దరఖాస్తు ఫారంలో తొలి పేజీలో కుటుంబ యజమాని పేరు, పుట్టిన తేదీ, ఆధార్‌ సంఖ్య, రేషన్‌కార్డు సంఖ్య, మొబైల్‌ ఫోన్‌ నంబరు, వృత్తితో పాటు సామాజికవర్గం వివరాలను నింపాలి. ఇందులో దరఖాస్తుదారు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఇతరులు.. ఏ విభాగంలోకి వస్తే అక్కడ టిక్‌ మార్కు పెట్టాలి. కింద కుటుంబసభ్యుల పేర్లు, వారి పుట్టిన తేదీలు, వారి ఆధార్‌ నంబర్లు రాయాలి. తర్వాత దరఖాస్తుదారు చిరునామా నింపాల్సి ఉటుంది. కుటుంబ వివరాల తర్వాత.. అయిదు పథకాలకు సంబంధించిన వివరాలున్నాయి. ఏ పథకానికి దరఖాస్తు చేయాలని అనుకుంటే ఆ పథకం దగ్గర టిక్‌ మార్కు చేయాలి. అలాగే అందులో అడిగిన వివరాలు నింపాల్సి ఉంటుంది.

మహాలక్ష్మి పథకం కింద- రూ.2,500 ఆర్థిక సహాయం:  ఈ పథకం కింద ఆర్థిక సాయం పొందాలంటే అక్కడ ఇచ్చిన బాక్సులో టిక్‌ మార్కు పెట్టాలి. ఇదే పథకంలో భాగమైన రూ.500కు గ్యాస్‌ సిలిండర్‌ లబ్ధి పొందాలంటే.. గ్యాస్‌ కనెక్షన్‌ నెంబర్, సిలిండర్‌ సరఫరా చేస్తున్న గ్యాస్‌ కంపెనీ పేరు, సంవత్సరానికి ఎన్ని సిలిండర్లు వాడుతున్నారు? అనే వివరాలు రాయాల్సి ఉంటుంది.

రైతు భరోసా: ఈ పథకం కింద లబ్ధి పొందాలనుకునే వ్యక్తి రైతా? కౌలు రైతా?.. అక్కడ టిక్‌ పెట్టాలి. పట్టాదారు పాసుపుస్తకం నంబర్లు. సాగు చేస్తున్న భూమి సర్వే నంబరు, సాగు విస్తీర్ణం లెక్కలు రాయాలి. దరఖాస్తుదారు వ్యవసాయ కూలీ అయితే.. ఉపాధి హామీ కార్డు నంబరు తదితర వివరాలు రాయాలి.

ఇందిరమ్మ ఇళ్లు: ఇల్లు లేని వారైతే ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం బాక్సులో టిక్‌ మార్కు చేయాల్సి ఉంటుంది. అమరవీరుల కుటుంబ సభ్యులు తమ పేరుతోపాటు.. అమరుడి పేరు, ఆయన మృతి చెందిన సంవత్సరం, ఎఫ్‌ఐఆర్‌, డెత్‌ సర్టిఫికెట్‌ నంబరు వివరాలు రాయాలి. తెలంగాణ ఉద్యమకారులైతే ఎదుర్కొన్న కేసుల ఎఫ్‌ఐఆర్‌, సంవత్సరం, జైలుకు వెళితే ఆ సంవత్సరం, జైలు పేరు, శిక్షా కాలం వివరాలు అందించాలి.

గృహజ్యోతి: కుటుంబానికి ప్రతి నెల 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు పథకం కింద.. దరఖాస్తుదారు నెలవారీ విద్యుత్తు వినియోగం వాడకం వివరాలు నింపాలి. ఇందులో 0-100 యూనిట్లు, 100-200 యూనిట్లు, 200 యూనిట్లపైన.. ఈ మూడింటిలో ఒక దాని ఎదురుగా టిక్‌ చేయాలి. గృహ వినియోగ విద్యుత్‌ మీటర్‌ కనెక్షన్‌ సంఖ్య ఫారంలో నింపాలి.

చేయూత: ఇప్పటికే పింఛను అందుకుంటున్నవారు ‘చేయూత’ పథకానికి దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. కొత్తగా పింఛను కోరుతున్నవారు మాత్రమే తమ వివరాలు ఇందులో అందులో రాయాలి. దివ్యాంగులైతే సంబంధిత బాక్సులో టిక్‌ చేసి సదరం సర్టిఫికెట్‌ సంఖ్య రాయాలి. ఇతరుల్లో.. వృద్ధాప్య, వితంతు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, డయాలసిస్‌ బాధితులు, ఎయిడ్స్‌ వ్యాధిగ్రస్తులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళ, ఫైలేరియా బాధితులు, బీడీ టేకేదార్‌లలో.. ఎవరైతే వారికి సంబంధించిన బాక్సులో టిక్‌ చేయాల్సి ఉంటుంది.

చివరి పేజీలో దరఖాస్తుదారు సంతకం లేదా వేలిముద్రతో పాటు పేరు, తేదీ రాయాలి. నింపిన దరఖాస్తు ఫారాన్ని గ్రామసభ, వార్డు సభల్లో అధికారులకు ఇవ్వాల్సి ఉంటుంది. దరఖాస్తు ఆఖరిపేజీలో కింది భాగంలో ప్రజాపాలన దరఖాస్తు రసీదు ఉంటుంది. దరఖాస్తుదారు పేరు, సంఖ్యతో పాటు దరఖాస్తు చేసిన పథకాల బాక్సులో టిక్‌ చేసి, సంబంధిత అధికారి సంతకం చేసి రసీదు ఇస్తారు. ఆ తర్వాత లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ ఉంటుంది.

Click Here To Download Application Form 

Leave a Comment

తెలంగాణలో అంగన్వాడీ ఉద్యోగాలు 2023 గ్రూప్‌ 4 పరీక్షకు హాజరయ్యే అభ్యర్ధులకు ముఖ్య సూచనలు.. ఇల్లు కట్టుకుంటే 3 లక్షలు మార్గదర్శకాలు విడుదల