గ్రూప్‌ 4 పరీక్షకు హాజరయ్యే అభ్యర్ధులకు ముఖ్య సూచనలు.. ఈ తప్పులు చేస్తే నో ఎంట్రీ

గ్రూప్‌-4 పరీక్ష ప్రారంభానికి రెండు సెషన్లలో 15 నిమిషాల ముందు గేట్లు మూసివేయనున్నారు.

ఎడమచేతి బొటన వేలిముద్ర తీసుకుని పరీక్ష హాల్‌లోకి ప్రవేశం కల్పిస్తారు

అభ్యర్ధులెవరూ ప్రశ్నపత్రంపై సమాధానాలు మార్క్‌ చేయకూడదని కమిషన్‌ స్పష్టం చేసింది

ఎలక్ట్రానిక్‌ పరికరాలు, రిమోట్‌తో కూడిన కారు తాళాలు, ఇతర వస్తువులేవీ లోపలికి అనుమతి ఉండదు. చెప్పులు మాత్రమే ధరించాలి. షూ వేసుకున్నవారిని అనుమతించారు.

ఓఎంఆర్‌ పత్రంలో బ్లూ లేదా బ్లాక్‌ పెన్‌తో పేరు, పరీక్ష కేంద్రం కోడ్, హాల్‌టికెట్, ప్రశ్నపత్రం నంబరు రాయాలని కమిషన్‌ తెలిపింది.

హాల్‌టికెట్, ప్రశ్నపత్రం నంబరు సరిగా రాయకున్నా, బ్లూ బ్లాక్‌ బాల్‌పాయింట్‌ పెన్‌కాకుండా ఇంక్‌పెన్, జెల్‌పెన్, పెన్సిల్‌ ఉపయోగించినా సదరు ఓఎంఆర్‌ పత్రం చెల్లుబాటుకాదని స్పష్టం చేసింది.