552 Anganwadi Jobs AndhraPradesh 2020:
నెల్లూరు జిల్లాలో 17 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 552 అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి కలెక్టర్ చక్రధర్‌బాబు ఆదివారం ప్రకటన విడుదల చేశారు. వీటిలో అంగన్‌వాడీ కార్యకర్తల ఉద్యోగాలు 115, మినీ అంగన్‌వాడీ కార్యకర్తలు 21, సహాయకుల పోస్టులు 416 ఉన్నాయి. అర్హత, ఆసక్తి ఉన్న మహిళలు ఈ నెల 17 నుంచి 28వ తేదీ సాయంత్రం లోపు ఆయా పంచాయతీ, వార్డు పరిధిలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆన్‌లైన్ పద్ధతిలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పదో తరగతి ఉత్తీర్ణులై, జులై 21, 2020 నాటికి 21 ఏళ్లు నిండి, 35 ఏళ్లలోపు వయస్సు కలిగి, స్థానిక వివాహిత మహిళలు అర్హులు. ఎస్సీ, ఎస్టీ ప్రాంతాల్లోని పోస్టులకు ఆ వర్గానికి చెందిన వారు మాత్రమే అర్హులని స్పష్టం చేశారు.
దరఖాస్తు చేసుకున్న వారికి… నాయుడుపేట రెవెన్యూ డివిజన్‌కు సెప్టెంబరు 5న, గూడూరు డివిజన్‌కు ఆరో తేదీ, నెల్లూరు డివిజన్‌కు 8, కావలికి 9వ తేదీ, ఆత్మకూరుకు 10వ తేదీల్లో ఆయా ప్రాంతాల ఆర్డీవో కార్యాలయాల్లో ఇంటర్వ్యూలు జరుగుతాయని పేర్కొన్నారు.