జనవరి 1న నూతన సంవత్సర కానుకగా.. దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు ప్రధాని నిధులను
విడుదల చేసిన విషయం అందరికి తెలిసిందే. 10వ విడత డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేశారు
ఇప్పటికే 10 కోట్ల మందికి పైగా చిన్న రైతులకు రూ.20వేల కోట్లకు పైగా డబ్బులను వారి
ఖాతాల్లో డిపాజిట్ చేశారు మోడీ గారు, దేశవ్యాప్తంగా చాలా మంది రైతుల ఖాతాల్లో
ఇప్పటికే డబ్బులు పడ్డాయి. కానీ కొందరు మాత్రం తమకు డబ్బులు అందలేదని, ఫోన్‌కు కూడా
ఎలాంటి msg రాలేదని చెబుతున్నారు ,పీఎం కిసాన్ official వెబ్సైట్ open చేయండి
ముందుగా పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్లో
(pmkisan.gov.in)కి
వెళ్లి రైట్ సైడ్ ఉన్న ఫార్మర్ కార్నర్ (Former Corner) ఆప్షన్ క్లిక్ చేయాలి,
తరువాత బెనిఫిషరీ లిస్ట్ (Beneficiary List)ని క్లిక్ చేయాలి.
RYTHU BHAROSA STATUS ELA CHUDALI
ఆ తర్వాత మీరు రాష్ట్ర, జిల్లా, మండలం, గ్రామం వివరాలు అడుగుతుంది. మీ గ్రామాన్ని
ఎంచుకున్న తర్వాత గెట్ రిపోర్ట్ (Get Report) ఆప్షన్ క్లిక్ చేయగానే ఆ గ్రామంలోని
లబ్ధిదారుల వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి. ఆ జాబితాలో ఉన్న వారందరికీ డబ్బు
వస్తాయి. ఐనప్పటికీ మీ ఖాతాల్లో డబ్బులు పడలేదంటే ఇలా చేయండి. పీఎం కిసాన్ హెల్ప్
లైన్ నెంబర్ అయినటువంటి 011-24300606 లేదా 011-23381092 కి కాల్ చేసి ఫిర్యాదు
చేయాలి. లబ్ధి దారుల జాబితాలో పేరు ఉన్నప్పటికీ డబ్బులు రాలేదని వారికి వివరించాలి.
హెల్ప్ లైన్ నెంబర్లతో పాటు సోమవారం నుంచి శుక్రవారం వరకు మెయిల్ ద్వారా message
చేసి కూడా ఫిర్యాదు చేయవచ్చు. pmkisan-ict@gov.in ఈమెయిల్ ఐడీకి మీ వివరాలతో పాటు
సమస్యలను వివరిస్తూ మెయిల్ చేయాలి
Radha
radhasanala@gmail.com